Share News

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:43 AM

40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందిపడుతూనే ఈ జోడీ శతకాలతో లఖ్‌నవూ స్టేడియాన్ని హోరెత్తించారు. అటు ఆరంభం నుంచే సాగిన ఎదురుదాడితో భారత్‌ 400 స్కోరు దాటేయడం విశేషం...

శతక మోతెక్కించారు గిల్‌, ఇషాన్‌ సెంచరీలు

  • 400+ స్కోరు చేసిన భారత్‌

  • చిత్తుగా ఓడిన అఫ్ఘానిస్థాన్‌

  • 2-0తో సిరీస్‌ కైవసం

ఓవైపు ఠారెత్తించే భానుడి ప్రతాపం.. మరోవైపు మైదానంలో గిల్‌, ఇషాన్‌ల పరుగుల వేట.

40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఇబ్బందిపడుతూనే ఈ జోడీ శతకాలతో లఖ్‌నవూ స్టేడియాన్ని హోరెత్తించారు. అటు ఆరంభం నుంచే సాగిన ఎదురుదాడితో భారత్‌ 400 స్కోరు దాటేయడం విశేషం. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇషాన్‌ మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఇక భారీ ఛేదనలో అఫ్ఘాన్‌.. లక్ష్యానికి చాలా దూరంలోనే నిలిచిపోగా.. సిరీస్‌ను భారత్‌ వశం చేసుకుంది.

లఖ్‌నవూ: కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154), ఇషాన్‌ కిషన్‌ (79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125) అద్భుత శతకాలతో అదరగొట్టారు. దీంతో బుధవారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 170 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అలాగే మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు ఖరోటికి నాలుగు, రషీద్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్‌ 44.3 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసి ఓడింది. రహ్మత్‌ షా (79), సెడిఖుల్లా (42), గుర్బాజ్‌ (41) మాత్రమే రాణించారు. పేసర్లు అర్ష్‌దీప్‌, గుర్నూర్‌లకు మూడేసి.. ప్రిన్స్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

పోటీ లేకుండానే..: కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో అఫ్ఘానిస్తాన్‌ ఓ మోస్తరుగానే ఆడింది. టాపార్డర్‌ మాత్రమే ఫర్వాలేదనిపించారు. పేసర్లు అర్ష్‌దీప్‌, గుర్నూర్‌ కట్టడి చేశారు. వెటరన్‌ రహ్మత్‌ షా పోరాడినా అతడికి సహకారం కరువైంది. ఓపెనర్లు గుర్బాజ్‌, జద్రాన్‌ (21) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించగా.. ఆ తర్వాత రహ్మత్‌-సెడిఖుల్లా జోడీ భారత బౌలర్లను కాసేపు ఎదుర్కోగలిగింది. మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాక అఫ్ఘాన్‌ వికెట్లు వేగంగా కోల్పోయింది. ఇక 45వ ఓవర్‌లో రహ్మత్‌ కీలక ఇన్నింగ్స్‌ను పేసర్‌ ప్రిన్స్‌ ముగించాడు. రిటైర్డ్‌ హర్డ్‌ అయిన రసూలి బ్యాటింగ్‌కు రాకపోవడంతో భారత్‌ ఘనవిజయం అందుకుంది.


స్కోరుబోర్డు

భారత్‌: జైస్వాల్‌ (సి) ఖరోటి (బి) సలీమ్‌ 4, రోహిత్‌ (బి) రషీద్‌ 48, గిల్‌ (సి) రసూలి (బి) ఖరోటి 154, ఇషాన్‌ (సి సబ్‌) అలిఖిల్‌ (బి) ఖరోటి 125, శ్రేయాస్‌ (సి) జద్రాన్‌ (బి) ఖరోటి 26, రాహుల్‌ (సి) జద్రాన్‌ (బి) ఖరోటి 0, సుందర్‌ (సి) గుర్బాజ్‌ (బి) రషీద్‌ 19, గుర్నూర్‌ (సి) జద్రాన్‌ (బి) రషీద్‌ 3, అర్ష్‌దీప్‌ (సి) రషీద్‌ (బి) ఘజన్‌ఫర్‌ 3, కుల్దీప్‌ (నాటౌట్‌), 3, ప్రిన్స్‌ (రనౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 49.5 ఓవర్లలో 402 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-9, 2-96, 3-320, 4-360, 5-360, 6-371, 7-387, 8-392, 9-396, 10-402. బౌలింగ్‌: ఘజన్‌ఫర్‌ 10-1-69-1, సలీమ్‌ సఫీ 8-0-75-1, బిలాల్‌ 8.5-0-90-0, ఖరోటి 10-0-76-4, రషీద్‌ 8-0-48-3, హష్మతుల్లా 5-0-36-0.

అఫ్ఘానిస్థాన్‌: గుర్బాజ్‌ (సి) రాహుల్‌ (బి) గుర్నూర్‌ 41, జద్రాన్‌ (సి) ప్రిన్స్‌ (బి) అర్ష్‌దీప్‌ 21, సెడికుల్లా (ఎల్బీ) సుందర్‌ 42, రహ్మత్‌ షా (సి) గుర్నూర్‌ (బి) ప్రిన్స్‌ 79, రసూలి (రిటైర్డ్‌ హర్ట్‌) 6, షాహిదీ (బి) గుర్నూర్‌ 4, ఖరోటి (బి) ప్రిన్స్‌ 6, రషీద్‌ (సి) రోహిత్‌ (బి) అర్ష్‌దీప్‌ 12, ఘజన్‌ఫర్‌ (సి) శ్రేయాస్‌ (బి) అర్ష్‌దీప్‌ 1, సలీమ్‌ (బి) గుర్నూర్‌ 9, బిలాల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 44.3 ఓవర్లలో 232 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-52, 2-71, 3-128, 4-140, 5-170, 6-188, 7-190, 8-220, 9-232. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 9-0-45-3, ప్రిన్స్‌ 7.3-0-56-2, గుర్నూర్‌ 10-0-60-3, కుల్దీప్‌ 10-0-42-0, సుందర్‌ 7-0-24-1, జైస్వాల్‌ 1-0-3-0.

1

వన్డేల్లో ఎక్కువ సార్లు (8) 400+ స్కోర్లు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికాతో సమంగా భారత్‌. అలాగే ఇంత భారీ స్కోరు చేిసీ ఆలౌటైన తొలి జట్టూ భారతే.

1

భారత్‌ తరఫున వన్డేల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (62)లోనే 3 వేల రన్స్‌ పూర్తి చేసిన బ్యాటర్‌గా గిల్‌.

2

అఫ్ఘాన్‌ జట్టుకిది వన్డేల్లో రెండో భారీ ఓటమి.

ఇవీ చదవండి:

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

Updated Date - Jun 18 , 2026 | 05:43 AM