Share News

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతుంది..

ABN , Publish Date - May 07 , 2026 | 02:13 AM

పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడల ఈవెంట్లపై గతేడాది విధించిన నిషేధం కొనసాగుతుందని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది...

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతుంది..

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడల ఈవెంట్లపై గతేడాది విధించిన నిషేధం కొనసాగుతుందని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, బహుళక్రీడల పోటీల విషయంలో అభ్యంతరాలు లేవని చెప్పింది. ఈ మేరకు జాతీయ క్రీడా సంఘాలు, భారత్‌ ఒలింపిక్‌సంఘం (ఐవోఏ), సాయ్‌కు మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ పంపింది. మల్టీ స్పోర్ట్స్‌ ఈవెంట్ల విషయంలో ఒలింపిక్‌ చార్టర్‌కు కట్టుబడి ఉంటామని పేర్కొం ది. పహిల్గాం ఉగ్రదాడుల తర్వాత యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో భారత క్రికెట్‌ జట్టు పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్‌తో ఆడే విషయంలో ప్రభుత్వ విధానంపై మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 07 , 2026 | 02:13 AM