భారత్ క్లీన్‌స్వీప్
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:18 AM
కొత్త కెప్టెన్ స్మృతి మంధాన ఆధ్వర్యంలో తొలి సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వేతో మంగళవారం...
మూడో టీ20లోనూ జింబాబ్వే చిత్తు
రాయ్‌పూర్: కొత్త కెప్టెన్ స్మృతి మంధాన ఆధ్వర్యంలో తొలి సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. జింబాబ్వేతో మంగళవారం జరిగిన మూడో టీ20లో మనోళ్లు 92 పరుగులతో గెలుపొందారు. హర్మన్‌ప్రీత్ (41 బంతుల్లో 91 నాటౌట్), షఫాలీ (37 బంతుల్లో 69) బ్యాటుతో, నందినీ (3/18) బంతితో అదరగొట్టడంతో భారత్ విజయం దక్కించుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 216/7 చేసింది. ఛేదనలో మన బౌలర్ల ధాటికి జింబాబ్వే 124/7 స్కోరుకే పరిమితమైంది. మేయర్స్ (60), బిజా (44) మాత్రమే రాణించారు.
ఈ వార్తలనూ చదవండి:
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి