పాక్‌ను పడగొట్టి.. సెమీస్‌కు భారత్
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:21 AM
పాకిస్థాన్‌పై యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. నెలన్నర కిందట జరిగిన అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం...
అండర్-19 వరల్డ్ కప్
బులవాయో: పాకిస్థాన్‌పై యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. నెలన్నర కిందట జరిగిన అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇందుకు..ఆదివారం జరిగిన అండర్-19 వన్డే వరల్డ్ కప్ సూపర్-6 పోరులో విజయం ద్వారా బదులిచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత్ 58 పరుగులతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అంతేకాదు టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరింది. తొలుత భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68), కనిష్క్ చౌహాన్ (35), వైభవ్ (30) రాణించారు. ఆల్‌రౌండర్ కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ (21) ఎనిమిదో వికెట్‌కు 32 బంతుల్లోనే 50 రన్స్ జత చేశారు. అబ్దుల్ సుభాన్ (3/33) మూడు, మహ్మద్ సయ్యమ్ (2/69) రెండు వికెట్లు సాధించారు. ఛేదనలో పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ (66), హమ్జా జహూర్ (42), ఫర్హాన్ యూసఫ్ (38) మాత్రమే రాణించారు. ఆయుష్ మాత్రే (3/21), ఖిలన్ పటేల్ (3/35) చెరో 3 వికెట్లు పడగొట్టారు. కనిష్క్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మంగళవారం జరిగే తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఢీకొంటాయి.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ