Share News

ఒక గండం గడిచింది!

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:06 AM

సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది. అయితే అసలైన..

ఒక గండం గడిచింది!

  • బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

  • టీ20 వరల్డ్‌ కప్‌

సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే టీమిండియా గ్రూప్‌ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో ఆడుతూ పాడుతూ గెలిచింది. అయితే అసలైన గండం ఆస్ట్రేలియా రూపంలో మనోళ్లకు పొంచి ఉంది. ఈనెల 28న జరిగే కీలక పోరులో కంగారూల పనికూడా పడితే సెమీస్‌ బెర్త్‌ ఖాయమవుతుంది.

మాంచెస్టర్‌ : గ్రూపు ఆఖరి రెండు మ్యాచ్‌లు చావో..రేవో అయిన వేళ హర్మన్‌ప్రీత్‌ సేన జూలు విదిల్చింది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఐదు వికెట్లతో చిత్తు చేసింది. మొదట బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 136/8 స్కోరుకే పరిమితమైంది. ఫిర్దౌస్‌ (33), నిగర్‌ సుల్తానా (32), శోభనా మోస్తరీ (22) మాత్రమే రాణించారు. రాధా యాదవ్‌ మూడు, శ్రీచరణి రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్‌ 16.5 ఓవర్లలో 139/5 స్కోరు చేసి నెగ్గింది. షఫాలీ (34 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 53) హాఫ్‌ సెంచరీతో మెరవగా, జెమీమా (26) యాస్తికా భాటియా (18 బంతుల్లో 23) సత్తా చాటారు. షఫాలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

ఓపెనర్ల జోరు: మంధాన, షషాలీ తొలి వికెట్‌కు మూడు ఓవర్లలోనే 31 రన్స్‌ జోడించి శుభారంభం ఇచ్చారు. మంధాన (8) త్వరగానే నిష్క్రమించినా..షఫాలీ, యాస్తికా వేగంగా ఆడి రెండో వికెట్‌కు 45 పరుగులు జత చేశారు. ఈ దశలో వడివడిగా వికెట్లు చేజార్చుకున్నా..హర్మన్‌, జెమీమా ఐదో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు మళ్లించారు.


శ్రీచరణి చరిత్ర : ఒకే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డుల కెక్కింది. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు సాధించడంతో మెగా టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో ఆమె తీసిన వికెట్లు సంఖ్య 12కి చేరింది. గతంలో ఈ రికార్డు పూనమ్‌ యాదవ్‌ (10 వికెట్లు) పేరిట ఉంది.

సంక్షిప్తస్కోర్లు: బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 136/8 (ఫిర్దౌస్‌ 33, నిగర్‌ సుల్తానా 32, శోభనా మోస్తరీ 22, రాధా యాదవ్‌ 3/28, శ్రీచరణి 2/21); భారత్‌ 16.5 ఓవర్లలో 139/5 (షఫాలీ 53, జెమీమా 26, యాస్తికా 23, హర్మన్‌ నాటౌట్‌ 13, రితూ మోనీ 2/29).

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 05:06 AM