Share News

భారత్‌ ‘ఎ’ 452/6 డిక్లేర్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:51 AM

శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్‌ నుంచి మరో సెంచరీ నమోదైంది. శుక్రవారం రెండోరోజు ఆటలో కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (141) అదరగొట్టాడు....

భారత్‌ ‘ఎ’  452/6 డిక్లేర్‌

లంక ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 113/2

గాలె: శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్‌ నుంచి మరో సెంచరీ నమోదైంది. శుక్రవారం రెండోరోజు ఆటలో కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ (141) అదరగొట్టాడు. దీంతో భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ను 452/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. రషీద్‌ (63), హర్ష్‌ దూబే (30) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆతిథ్య లంక ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 113/2 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉండగా.. క్రీజులో ఫెర్నాండో (65), ఆషెన్‌ బండార (18) ఉన్నారు.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 05:52 AM