Share News

నేపాల్‌.. 26కే ఢమాల్‌

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:00 AM

భారత ఫాస్ట్‌ బౌలర్లు ప్రిన్స్‌ యాదవ్‌ (5-2-6-5), హర్షిత్‌ రాణా (6-1-16-4) పేస్‌, స్వింగ్‌ బంతులకు నేపాల్‌ కుదేలైంది. జట్టులో ఒక్కరంటే ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు..

నేపాల్‌.. 26కే ఢమాల్‌

306 రన్స్‌తో భారత్‌ ‘ఎ’ ఘన విజయం

  • ప్రిన్స్‌కు 5, హర్షిత్‌కు 4 వికెట్లు

  • తిలక్‌, కుశాగ్ర సెంచరీలు

  • రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌

దోహా: భారత ఫాస్ట్‌ బౌలర్లు ప్రిన్స్‌ యాదవ్‌ (5-2-6-5), హర్షిత్‌ రాణా (6-1-16-4) పేస్‌, స్వింగ్‌ బంతులకు నేపాల్‌ కుదేలైంది. జట్టులో ఒక్కరంటే ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నేపాల్‌ బ్యాటర్లంతా కలిసి చేసిన స్కోరు 26. భారత ఓపెనర్‌ సూర్యవంశీ ఒక్కడి స్కోరు (26)నే నేపాల్‌ జట్టంతా కలిసి చేయడం గమనార్హం. దరిమిలా ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌ వన్డే టోర్నీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 306 పరుగులతో భారత్‌ ‘ఎ’ ఘనమైన బోణీ చేసింది. కుమార కుశాగ్ర (117), కెప్టెన్‌ తిలక్‌ వర్మ (107) శతక మోత మోగించగా తొలుత భారత్‌ ‘ఎ’ 50 ఓవర్లలో 332/9 స్కోరు చేసింది. కుశాగ్ర, తిలక్‌ నాలుగో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. భారీ ఛేదనలో భారత బౌలర్ల ధాటికి నేపాల్‌ చిగురుటాకులా వణికి 11.3 ఓవర్లలో 26 పరుగులకే చాపచుట్టేసింది. రషీద్‌ ఖాన్‌ (6), పవన్‌ సరాఫ్‌ 6) టాప్‌ స్కోరర్లు. ఎక్స్‌ట్రాలు (5) తదుపరి అత్యధిక స్కోరు. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.

సంక్షిప్తస్కోర్లు

భారత్‌ ‘ఎ’: 50 ఓవర్లలో 332/9 (కుశాగ్ర 117, తిలక్‌ 107, సూర్యాన్ష్‌ 36, వైభవ్‌ 26, లలిత్‌ 3/61, లామిచానె 3/61, నందన్‌ 2/49).

నేపాల్‌: 11.3 ఓవర్లలో 26 ఆలౌట్‌ (రషీద్‌ ఖాన్‌ 6, పవన్‌ సర్రాఫ్‌ 6, ప్రిన్స్‌ యాదవ్‌ 5/6, హర్షిత్‌ రాణా 4/16).

ఇవి కూడా చదవండి:

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!

ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా

Updated Date - Nov 21 , 2026 | 06:00 AM