ఆసీస్ ‘ఎ’ లక్ష్యం 363
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:31 AM
ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 363 పరుగుల లక్ష్యంతో...
ప్రస్తుతం 55/2
భారత్ ‘ఎ’తో అనధికార టెస్టు
పుదుచ్చేరి: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. 363 పరుగుల లక్ష్యంతో గురువారం మూ డో రోజు బరిలోకి దిగిన ఆసీస్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 55/2 స్కోరుతో నిలిచింది. ఆసీస్ ఇంకా 308 పరుగుల దూరంలో ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ (59), కుమార్ కుషాగ్ర (46 నాటౌట్), సాయి సుదర్శన్ (39) రాణించారు. మర్ఫీకి నాలుగు వికెట్లు దక్కాయి.
ఈ వార్తలనూ చదవండి:
వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..