Share News

రచిన్‌, చాప్‌మన్‌ అవుట్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:41 AM

గాయాల నుంచి కోలుకోకపోవడంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్‌ సీనియర్‌ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ దూరమయ్యారు...

రచిన్‌, చాప్‌మన్‌ అవుట్‌

ఆక్లాండ్‌: గాయాల నుంచి కోలుకోకపోవడంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్‌ సీనియర్‌ బ్యాటర్లు రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ దూరమయ్యారు. ఈమేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ సోమవారం ప్రకటించింది. దాంతో నాలుగు, ఐదు వన్డేలకు మాత్రమే ఎంపిక చేసిన టిమ్‌ సైఫర్ట్‌ ఇక పూర్తి సిరీస్‌లో పాల్గొంటాడు. హెన్రీ నికోల్స్‌ తొలి మూడు వన్డేలకు జట్టులోకి రానున్నాడు. డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ను నాలుగు, ఐదు మ్యాచ్‌లకు ఎంపిక చేశారు. మ్యాట్‌ హెన్రీ ఫిట్‌నెస్‌ను పరీక్షించనుండగా, నాలుగు, ఐదు వన్డేలకు ఎంపికైన మ్యాట్‌ ఫిషర్‌ సిరీస్‌ మొత్తం కొనసాగనున్నాడు.

ఈ వార్తలూ చదవండి

సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 03:41 AM