Share News

మూడో స్థానంలోనే భారత మహిళలు

ABN , Publish Date - May 02 , 2026 | 01:53 AM

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్‌ భారత జట్టు మూడో స్థానంలోనే కొనసాగుతోంది. శుక్రవారం ప్రకటించిన...

మూడో స్థానంలోనే భారత మహిళలు

వన్డే ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ చాంపియన్‌ భారత జట్టు మూడో స్థానంలోనే కొనసాగుతోంది. శుక్రవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 124 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా (163) టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అయితే భారత్‌ కంటే 4 పాయింట్లు అదనంగా ఉన్న ఇంగ్లండ్‌ (128) రెండో స్థానంలో నిలిచింది. నిరుడు వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా ఆవిర్భవించిన భారత్‌..నాటినుంచి 3 వన్డేలే ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మూడు మ్యాచ్‌లలోనూ హర్మన్‌ సేన ఓడిపోయింది. దక్షిణాఫ్రికా (100), న్యూజిలాండ్‌ (93), శ్రీలంక (89) వరుసగా 4, 5, 6 స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 01:53 AM