సల్మాన్ ఆఘాకు ఐసీసీ మందలింపు
ABN , Publish Date - Mar 15 , 2026 | 05:59 AM
పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో సల్మాన్ గ్లోవ్స్, హెల్మెట్, బ్యాట్‌ను...
మీర్పూర్: పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో సల్మాన్ గ్లోవ్స్, హెల్మెట్, బ్యాట్‌ను విసిరేశాడు. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్1 అతిక్రమణ కిందికి వస్తుంది. దీంతో సల్మాన్‌ను మందలించడంతో పాటు ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించారు. ఆ మ్యాచ్‌లో రిజ్వాన్ ఆడిన షాట్ నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ ప్యాడ్లను తాకి ఆగింది. అప్పటికి సల్మాన్ క్రీజు బయటే ఉన్నాడు. అయితే ఆ బంతిని తీసి బౌలర్ మెహిదీ హసన్‌కు ఇచ్చేంతలోపు.. మెహదీనే ఆ బంతిని అందుకుని సల్మాన్‌ను రనౌట్ చేశాడు. రివ్యూలో ఇది అవుట్‌గా తేలడంతో సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్లోవ్స్, బ్యాట్‌ను డగౌట్ దగ్గర విసిరేయడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ రనౌట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాక్ అభిమానులు వాదిస్తుండగా, ఇదేమీ చారిటీ మ్యాచ్ కాదని, రూల్స్‌కు కట్టుబడే అవుట్ చేశామంటూ బంగ్లా అంటోంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..