వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:05 AM
సరిగ్గా ఏడాది తర్వాత జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 14 జట్లు పాల్గొంటున్న ఈ మెగాటోర్నీలో 12 వేదికల్లో 57 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా...
భారత్-పాక్ ఒకే గ్రూపులో..
ఆసీస్‌తో ఆరంభ మ్యాచ్
జొహాన్నె్‌సబర్గ్‌లో ఫైనల్
జొహాన్నె్‌సబర్గ్: సరిగ్గా ఏడాది తర్వాత జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 14 జట్లు పాల్గొంటున్న ఈ మెగాటోర్నీలో 12 వేదికల్లో 57 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిస్తున్న ఈ వరల్డ్‌కప్ వచ్చే అక్టోబరు 2న మొదలై నవంబరు 21లో వాండరర్స్ మైదానంలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీ నాలుగు దశల్లో ఉంటుంది. మొదట సూపర్ సిరీస్, ఆ తర్వాత ఆరేసి జట్లతో కూడిన రెండు గ్రూప్‌లు తలపడతాయి. వీటి తర్వాత రౌండ్ రాబిన్ పద్దతిన సూపర్ 7 ఉంటుంది. ఇందులో నుంచి టాప్-4 జట్లు సెమీ్‌సకు, ఆ త ర్వాత ఫైనల్‌కు వెళతాయి. సెమీస్, ఫైనల్‌కు రిజర్వ్‌డేస్ ఉంటాయి.
10న దాయాదితో మ్యా చ్: టీమిండియా గ్రూప్ ‘ఎ’లో చోటు దక్కించుకుంది. దీంట్లో పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే, క్వాలిఫయర్-ఎ జట్లున్నాయి. గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ ‘బి’ టీమ్స్ ఉన్నాయి. గిల్ సేన అక్టోబరు 7న తమ టైటిల్ వేటను ఆసీ్‌సతో ఆరంభించనుంది. ఇక అత్యంత ఆసక్తికర భారత్-పాక్ సమరం అక్టోబరు 10న జొహాన్నె్‌సబర్గ్‌లో జరుగుతుంది.
భారత్ షెడ్యూల్
ప్రత్యర్థి తేదీ
ఆసీస్‌తో అక్టోబరు 7
పాక్‌తో అక్టోబరు 10
అఫ్ఘాన్‌తో అక్టోబరు 14
క్వాలిఫయర్ ‘ఎ’తో అక్టోబరు 17
జింబాబ్వేతో అక్టోబరు 24
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..
హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..