Share News

డే టెస్టుల్లోనూ పింక్‌ బాల్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 03:04 AM

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తమ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ రోజు ఆదివారం ఐసీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు...

డే టెస్టుల్లోనూ పింక్‌ బాల్‌

పాకిస్థాన్‌లో మహిళల టీ20 వరల్డ్‌కప్‌

కెనడా క్రికెట్‌ బోర్డుపై నిషేధం

ఐసీసీ ఆమోదం

అహ్మదాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తమ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ రోజు ఆదివారం ఐసీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యా రు. ఇందులో భాగంగా.. ఇక నుంచి డే టెస్టుల్లోనూ ప్రయోగాత్మకంగా గులాబీ బంతి వాడేందుకు అనుమతిస్తారు. వెలుతురులేమి కారణంగా మ్యాచ్‌లు ముందుగానే ముగియకుండా ఈ బంతిని వినియోగించవచ్చు. ఇక 2028 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ పాక్‌లో జరుగనుంది. అయితే భారత్‌ మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికల్లో ఆడిస్తారు. అంతేకాకుండా ఈ ఏడాది ఐసీసీ మహిళల ఎమర్జింగ్‌ నేషన్స్‌ ట్రోఫీని నిర్వహిస్తారు. మరోవైపు అవినీతి ఆరోపణల కారణంగా క్రికెట్‌ కెనడా సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి...

ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్

చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం

Updated Date - Jun 02 , 2026 | 03:04 AM