Share News

హిమతేజ శతకం

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:11 AM

ఖమ్మం ఏసెస్‌ జట్టు టీజీ20 లీగ్‌లో ప్లేఆ్‌ఫ్సకు చేరింది. హైదరాబాద్‌ తర్వాత ప్లేఆఫ్స్‌ చేరిన రెండో జట్టు ఖమ్మం. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో...

హిమతేజ శతకం

  • టీజీ20లో ప్లేఆఫ్స్‌ చేరిన ఖమ్మం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖమ్మం ఏసెస్‌ జట్టు టీజీ20 లీగ్‌లో ప్లేఆ్‌ఫ్సకు చేరింది. హైదరాబాద్‌ తర్వాత ప్లేఆఫ్స్‌ చేరిన రెండో జట్టు ఖమ్మం. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో మెదక్‌ ఫాల్కన్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఖమ్మం 19 పరుగులతో నెగ్గింది. తొలుత ఖమ్మం 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 190 పరుగులు చేసింది. హిమతేజ అజేయ సెంచరీ (103)తో సత్తా చాటాడు. ఛేదనలో మెదక్‌ జట్టు పోరాడి ఓడింది. 20 ఓవర్లలో 171/7 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. స్రుంజిత్‌ రెడ్డి అర్ధ శతకం (60)తో రాణించాడు. ఖమ్మం బౌలర్లలో విద్యానంద రెడ్డి (2/7), వాఫి కచ్చి డైమండ్‌ (2/15) చెరో రెండు వికెట్లు తీశారు. సెంచరీ వీరుడు హిమతేజకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 03:11 AM