Share News

గవర్నర్‌ను కలిసిన హెచ్‌సీఏ కార్యదర్శి

ABN , Publish Date - May 09 , 2026 | 02:24 AM

రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీ ఏ) కార్యదర్శి జీవన్‌ రెడ్డి శుక్రవారం...

 గవర్నర్‌ను కలిసిన  హెచ్‌సీఏ  కార్యదర్శి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీ ఏ) కార్యదర్శి జీవన్‌ రెడ్డి శుక్రవారం లోక్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామీణ స్ధాయిలో క్రికెట్‌ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, టీజీ 20 లీగ్‌ గురించి గవర్నర్‌కు వివరించారు. అలాగే ఈ నెల 22న ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ను వీక్షించాలంటూ గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 09 , 2026 | 02:24 AM