జగన్‌మోహన్ రావుపై వేటు
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:36 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావును తొలగిస్తూ అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ ఉత్తర్వులు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావును తొలగిస్తూ అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. జగన్‌మోహన్ రావుపై సీఐడీ మోపిన తీవ్రమైన అభియోగాల కారణంగా అతడికి అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో జగన్‌మోహన్‌రావు తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన అమర్‌నాథ్ హెచ్‌సీఏ చీఫ్‌గా ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. జగన్‌మోహన్ రావుపై గతంలో విధించిన సస్పెన్షన్ మరో రెండ్రోజుల్లో ముగియనుంది.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!