హెచ్‌సీఏ అధ్యక్షుని నియామకం చెల్లదు
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:07 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియామకం చెల్లదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది....
అమర్‌నాథ్ తప్పుకోవాలంటూ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియామకం చెల్లదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. సోమవారం ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. అమర్‌నాథ్‌ను తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్‌మోహన్ రావు చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిన అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్ సురేష్ ఉత్తర్వులతో అనూహ్యంగా అధ్యక్షుడిగా నియమితుడవడం తెలిసిందే. హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం ఈ నియామకం అనైతికమని కొందరు అంబుడ్స్‌మన్ ఉత్తర్వులను సవాల్ చేయడంతో.. ఈ మేరకు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. వెంటనే ఎస్‌జీఎం ఏర్పాటు చేసి, 45 రోజుల్లోగా ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని ఆదేశించింది. అప్పటిదాకా ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్‌ను అధ్యక్షుడి బాధ్యతలను నిర్వర్తించాలని సూచించింది. ఇక, హెచ్‌సీఏ కార్యదర్శిగా తనను అన్యాయంగా తొలగించారని దేవ్‌రాజ్ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 22కు వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?