Share News

ఐర్లాండ్‌ చేజేతులా..

ABN , Publish Date - Feb 09 , 2026 | 06:05 AM

ప్రధాన జట్లకు ఏమాత్రం బెదరకుండా తాజా టీ20 వరల్డ్‌క్‌పలో చిన్న జట్లు పోటీనిస్తున్నాయి. గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌...

ఐర్లాండ్‌ చేజేతులా..

  • తిప్పేసిన హసరంగ, తీక్షణ

  • శ్రీలంక విజయం

కొలంబో: ప్రధాన జట్లకు ఏమాత్రం బెదరకుండా తాజా టీ20 వరల్డ్‌క్‌పలో చిన్న జట్లు పోటీనిస్తున్నాయి. గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో రాణించినా.. ఆఖర్లో తడబాటుతో మూల్యం చెల్లించుకుంది. దీంతో లంక 20 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (56 నాటౌట్‌), కమిందు మెండిస్‌ (44) ఆదుకున్నారు. మొదట ఐర్లాండ్‌ బౌలర్ల ధాటికి ఇబ్బంది పడిన లంక 7-15 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోయింది. కానీ ఆ తర్వాత కమిందు-కుశాల్‌ జోరుకు బౌలర్లు లయ తప్పడంతో ఆఖరి 4 ఓవర్లలో లంక 60 పరుగులతో కోలుకుంది. డాక్‌రెల్‌, మెక్‌కార్తిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఐర్లాండ్‌ 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. టెక్టర్‌ (40), అడెయిర్‌ (34), టక్కర్‌ (21) రాణించారు. ఓ దశలో జట్టు 104/2తో గెలుపు దిశగా సాగుతున్నా.. స్పిన్నర్లు హసరంగ, తీక్షణల ధాటికి చివరి ఆరు ఓవర్లలో టపాటపా వికెట్లను కోల్పోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా కమిందు మెండిస్‌ నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు:

శ్రీలంక: 20 ఓవర్లలో 163/6 (కుశాల్‌ 56 నాటౌట్‌, కమిందు 44, నిస్సాంక 24; డాక్‌రెల్‌ 2/17, మెక్‌కార్తి 2/40).

ఐర్లాండ్‌: 19.5 ఓవర్లలో 143 ఆలౌట్‌ (టెక్టర్‌ 40, అడెయిర్‌ 34, టక్కర్‌ 21; తీక్షణ 3/23, హసరంగ 3/25, పథిరన 2/26).

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 06:05 AM