Share News

వణికించిన హసన్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:22 AM

వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్‌ మహమూద్‌ (6/55) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో గురువారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో కంగారూలు తమ మొదటి...

వణికించిన హసన్‌

ఆరు వికెట్లతో చెలరేగిన పేసర్‌

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 198 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 96/1

డార్విన్‌: వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్‌ మహమూద్‌ (6/55) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. దీంతో గురువారం ఆరంభమైన ఈ తొలి టెస్టులో కంగారూలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలారు. పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన ఆసీస్‌ హసన్‌ను ఎదుర్కోవడంలో తడబడింది. స్టీవ్‌ స్మిత్‌ (71) ఒక్కడే దీటుగా ఆడగలిగాడు. ఆ తర్వాత ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ (23) మాత్ర మే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. హోస్సేన్‌, టస్కిన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. క్యారీ (19)తో కలిసి స్మిత్‌ ఐదో వికెట్‌కు అత్యధికంగా 56 పరుగులు జోడించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ 24 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్‌ హక్‌ (35 బ్యాటింగ్‌), ఓపెనర్‌ తన్‌జీద్‌ హసన్‌ తమీమ్‌ (32 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆసీ్‌సకన్నా బంగ్లా ఇంకా 102 పరుగులు వెనుకబడింది.

ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 434వ వికెట్‌ సాధించి కపిల్‌దేవ్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో లంక లెఫ్టామ్‌ స్పిన్నర్‌ రంగన హెరాత్‌ (433)ను దాటేశాడు. ఇక టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్టామ్‌ పేసర్‌గా స్టార్క్‌ రికార్డుల్లోకి ఎక్కాడు.

1

ఆసీస్‌పై టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు (6) తీసిన బంగ్లా బౌలర్‌గా మహమూద్‌. అలాగే తమ జట్టు తరఫున ఎక్కువసార్లు (3) 5+ వికెట్లు తీసిన రెండో పేసర్‌గా మహమూద్‌. షహదత్‌ హుస్సేన్‌ (4) ముందున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 05:22 AM