జ్వరంతోనే బరిలోకి దిగి.. శతకంతో చెలరేగి..
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:57 AM
పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. స్వదేశంలో జింబాబ్వే సిరీ్‌సతో మళ్లీ టచ్‌లోకి వచ్చింది. రెండో వన్డేలో...
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. స్వదేశంలో జింబాబ్వే సిరీ్‌సతో మళ్లీ టచ్‌లోకి వచ్చింది. రెండో వన్డేలో హర్మన్ (126) శతకంతో అదరగొట్టింది. అయితే, మ్యాచ్‌కు ముందు రోజు స్వల్ప జ్వరంతో బాధపడినా.. ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ తీసుకొని బరిలోకి దిగింది. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో.. క్రీజులోకి వచ్చిన హర్మన్ 43 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. ప్రతీకతో కలసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టిన కౌర్.. దీప్తి అండతో జట్టుకు భారీ స్కోరు అందించింది. ‘మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరం వచ్చింది. చాలాసేపు ఎండలో బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఫీల్డింగ్‌కు వచ్చినప్పుడు ఇబ్బందిపడ్డా. ఓపిక లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలనుకొన్నా. కానీ, మందులు వేసుకొన్నాక కొంత ఉపశమనం లభించింద’ని హర్మన్ తెలిపింది. సెంచరీతో తన బాధ మొత్తం పోయిందని చెప్పింది. సారథ్య భారం లేకపోవడంతో.. బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..