Share News

హార్దిక్‌ పాండ్యాపై ఫిర్యాదు

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:07 AM

టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. ఫైనల్లో కివీ్‌సపై గెలిచాక భారత జాతీయ పతాకాన్ని భుజంపై...

హార్దిక్‌ పాండ్యాపై ఫిర్యాదు

ముంబై: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. ఫైనల్లో కివీ్‌సపై గెలిచాక భారత జాతీయ పతాకాన్ని భుజంపై కప్పుకుని తన గర్ల్‌ఫ్రెండ్‌తో గెంతులు వేయడం, ఆమెతో కలిసి పోడియంపై పడుకోవడం సోషల్‌ మీడియాలోనూ చర్చకు దారి తీసింది. ఇదే విషయమై పుణెకు చెందిన లాయర్‌ వాజిద్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘1971 నేషనల్‌ ఫ్లాగ్‌ యాక్ట్‌ ప్రకారం పౌరులంతా జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలి. కానీ పాండ్యా మాత్రం పతాకాన్ని ఒంటికి చుట్టుకుని తన గర్ల్‌ఫ్రెండ్‌తో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఇది జెండాను అవమానపర్చడమే అవుతుంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని వాజిద్‌ తెలిపాడు. 2024 టోర్నీ సమయంలోనూ అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ జాతీయ పతాకాన్ని నేలకు తాకించాడనే ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 13 , 2026 | 03:07 AM