కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్?
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:12 AM
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో ఏ జట్టుకు ఆడతాడనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్ల పేర్లు తెరపైకి రాగా తాజాగా ఈ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్...
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో ఏ జట్టుకు ఆడతాడనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే చెన్నై, గుజరాత్ జట్ల పేర్లు తెరపైకి రాగా తాజాగా ఈ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా చేరింది. ఈ జట్టు కెప్టెన్ అజింక్యా రహానె ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టు పగ్గాలు చేపట్టాలంటే హార్దిక్ ఓ షరతు విధించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కేకేఆర్ సహాయక సిబ్బందిలో ఒకడైన అభిషేక్ నాయర్‌ను తొలగిస్తేనే ఆడతానని హార్దిక్ చెప్పినట్టు సమాచారం. అభిషేక్‌కు రోహిత్ శర్మతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి పాండ్యా టీజ్ చేస్తున్న వీడియోను ‘వేచి చూడండి’ అనే కామెంట్‌తో కోల్‌కతా జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో కేకేఆర్ అభిమానులు హార్దిక్ రావడం ఖాయమనే సంబరాల్లో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..