Share News

భారత ‘ఏ’ జట్టులో హార్దిక్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:03 AM

గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూ రంగా ఉంటున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనానికి సిద్ధమయ్యాడు. భారత ‘ఏ’ జట్టు తరఫున వన్డే సిరీ్‌సలో..

భారత ‘ఏ’ జట్టులో హార్దిక్‌

షేక్‌ రషీద్‌కు అవకాశం

ఆస్ట్రేలియా ‘ఏ’తో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌

న్యూఢిల్లీ: గాయం కారణంగా కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూ రంగా ఉంటున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనానికి సిద్ధమయ్యాడు. భారత ‘ఏ’ జట్టు తరఫున వన్డే సిరీ్‌సలో హార్దిక్‌ ఆడనున్నాడు. ఆతిథ్య భారత ‘ఏ’తో ఆస్ట్రేలియా ఏ జట్టు 2 మల్టీ డే మ్యాచ్‌లు (సెప్టెంబరు 22 నుంచి, 29 నుంచి), 3 వన్డేలు (అక్టోబరు 6, 9, 11) ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ పుదుచ్చేరిలో జరుగుతాయి. ఇందుకోసం రెండు ఫార్మాట్ల జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. వన్డే జట్టులో హార్దిక్‌కు చోటు దక్కింది. అయితే, ఫిట్‌నె్‌సను నిరూపించుకుంటేనే పాండ్యాకు తుదిజట్టులో చోటు దక్కుతుందని బోర్డు స్పష్టం చేసింది. మల్టీ డే మ్యాచ్‌లకు దేవ్‌దత్‌ పడిక్కళ్‌ కెప్టెన్‌ కాగా.. వన్డే సిరీ్‌సకు రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథిగా వ్యవహరిస్తాడు. ఇక, తెలుగు కుర్రాడు, గుంటూరుకు చెందిన షేక్‌ రషీద్‌కు మల్టీ డే ఫార్మాట్‌ జట్టులో స్థానం లభించింది.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:03 AM