07:07 ఏమిటబ్బా..!
ABN , Publish Date - May 26 , 2026 | 02:25 AM
అటు కెప్టెన్‌గా.. ఇటు ఆటగాడిగా ఈసారి ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ముంబై జట్టు తానాడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాల ద్వారా లభించిన 8 పాయింట్లతో...
హార్దిక్ పోస్ట్ వెనుక మర్మం అదేనా?
ముంబై: అటు కెప్టెన్‌గా.. ఇటు ఆటగాడిగా ఈసారి ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ముంబై జట్టు తానాడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాల ద్వారా లభించిన 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో లీగ్‌ను ముగించింది. ఈనేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కథనానికి జోడించిన ఫొటో సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ల్యాప్‌టా్‌పలో ఓ సినిమా వస్తుండగా, పక్కన నోట్‌బుక్, పెన్‌తోపాటు హార్దిక్ మొబైల్ కూడా ఆ చిత్రంలో కనిపిస్తుంది. విషయం అదికాదు..హార్దిక్ సెల్‌ఫోన్‌లో కనిపించిన సమయం 07.07 నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆ ‘ఏడో నెంబర్’ చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు ధోనీ జెర్సీది కావడం. గాయాలతో ఈసారి ఐపీఎల్‌లో ఒక్క మ్యాచూ ఆడని మహీ..వచ్చే ఏడాది రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరోవైపు..ఈసారి అట్టర్‌ఫ్లాపైన హార్దిక్‌ను వచ్చే సీజన్‌లో ముంబై వదిలేస్తుందని, దీంతో 2027లో హార్దిక్ చెన్నైకి మారతాడని అంటున్నారు. దాని సంకేతంగానే మొబైల్‌లో ‘ఏడో నెంబర్’తో ఫొటో దిగాడని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!
ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!