రూ. 12 కోట్ల కారులో..
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:29 AM
ఖరీదైన లగ్జరీ కారు.. పక్కన అందమైన ప్రేయసి. ఇంకేం.. జామ్ జామ్ అంటూ రయ్‌న దూసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. మైదానంలో...
ప్రేయసితో హార్దిక్ షికారు
న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కారు.. పక్కన అందమైన ప్రేయసి. ఇంకేం.. జామ్ జామ్ అంటూ రయ్‌న దూసుకెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. మైదానంలో దూకుడైన ఆటతీరుతో చెలరేగే హార్దిక్.. వ్యక్తిగత జీవితంలోనూ అంతే జోష్‌గా కనిపిస్తాడు. ఇప్పటికే రోల్స్ రాయిస్, లంబోర్గిని, ఆడి, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్‌లాంటి లగ్జరీ కార్లు ఉన్న హార్దిక్ గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు చేరింది. రూ. 12 కోట్ల విలువైన సరికొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారును పాండ్యా కొనుగోలు చేసినట్లు తెలిసింది. నలుపు రంగులో ఉన్న ఈ లగ్జరీ కారులో తన గాళ్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి హార్దిక్ ముంబై వీధుల్లో షికారు చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. హార్దిక్ స్వయంగా నడుపుతూ వెళ్లిన ఈ ఫెరీరా కారుకు రిజిస్ట్రేషన్ నంబర్ లేదు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు