గంభీర్‌పై విమర్శలెందుకు?
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:14 AM
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతడిపై వస్తున్న విమర్శలను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. గౌతీ ముక్కుసూటి....
అతడు ముక్కుసూటి మనిషి: హర్భజన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతడిపై వస్తున్న విమర్శలను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. గౌతీ ముక్కుసూటి మనిషి కావడంతో అతడి నిర్ణయాలు కొందరికి నచ్చడం లేదేమోనని సందేహం వ్యక్తం చేశాడు. గంభీర్ శిక్షణలోనే భారత జట్టు టీ20 వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియాక్‌పలను గెలిచిన విషయం మరువరాదన్నాడు. ‘జట్టు బాగా ఆడకపోతే వెంటనే కోచ్‌ను నిందించడం ఎందుకో అర్థం కాదు. ఆటపట్ల ఎంతో నిబద్ధత ఉన్న గంభీర్ చాలా తెలివైన వ్యక్తి. అంతేకాకుండా తను ఉన్నదున్నట్లు చెప్పే వ్యక్తి. ఇలా చెప్పడం కొందరికి నచ్చకపోవచ్చు. యువకుడిగా జట్టులో చేరినప్పుడు సెహ్వాగ్, అమిత్ మిశ్రా, మునా్‌ఫలాంటి కొద్ది మందితోనే గంభీర్ మాట్లాడేవాడు’ అని భజ్జీ వివరించాడు. మరోవైపు రోహిత్-విరాట్ ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడడంలో తప్పు లేదని మద్దతు పలికాడు. ఫుట్‌బాల్‌లో మెస్సీ, రొనాల్డో ఆడగా లేనిది రో-కో వన్డేల్లో కొనసాగితే తప్పేమిటి? అంటూ హర్భజన్ ప్రశ్నించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..