Share News

ఒక్క పరుగుతో..

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:54 AM

ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో.. నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. బుధవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఒక్క పరుగు తేడాతో...

ఒక్క పరుగుతో..

నేటి మ్యాచ్‌

కోల్‌కతా X లఖ్‌నవూ

వేదిక కోల్‌కతా రా.7.30 నుంచి

ఆఖరి బంతికి గుజరాత్‌ గెలుపు

ఉత్కంఠ పోరులో ఢిల్లీకి నిరాశ

న్యూఢిల్లీ: ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో.. నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. బుధవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ఢిల్లీ విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా.. మిల్లర్‌ సింగిల్‌ తీస్తే స్కోరు సమమయ్యేది. కానీ, ఆఖరి బంతిని మిల్లర్‌ మిస్‌ కాగా.. కుల్దీప్‌ (1)ను బట్లర్‌ రనౌట్‌ చేశాడు. ్ఞఫలితం.. మ్యాచ్‌ గుజరాత్‌ సొంతం. తొలుత గుజరాత్‌ 20 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), బట్లర్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52), వాషింగ్టన్‌ సుందర్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ముకేశ్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ ఓవర్లన్నీ ఆడి 209/8 స్కోరుకే పరిమితమైంది. కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92), మిల్లర్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 నాటౌట్‌) పోరాటాలు వృథా అయ్యాయి. రషీద్‌ 3, ప్రసిద్ధ్‌ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. రషీద్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

మధ్యలో తడబాటు: ఛేదనలో ఓపెనర్లు రాహుల్‌, నిస్సాంక (41) తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు నిలకడైన ఆరంభాన్నిచ్చారు. ఆరో ఓవర్‌లో అశోక్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌండ్రీ కొట్టగా.. 4,6,4,4తో నిస్సాంక బ్యాట్‌కు పనిచెప్పడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. దీంతో ఢిల్లీ 63/0తో పవర్‌ప్లేను ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో రషీద్‌ కీలక వికెట్లతో ఒత్తిడి పెంచాడు. 9వ ఓవర్‌ తొలి బంతికి ప్రసిద్ధ్‌.. నిస్సాంకను అవుట్‌ చేశాడు. కానీ, ఒక్కసారిగా గేర్‌ మార్చిన రాహుల్‌ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. కాగా, 10వ ఓవర్‌లో నితీశ్‌ రాణా (5), సమీర్‌ రిజ్వీ (0)ను రషీద్‌ అవుట్‌ చేశాడు. మిల్లర్‌ గాయంతో మైదానం వీడగా.. ఆ స్థానంలో వచ్చిన కెప్టెన్‌ అక్షర్‌ (2)ను కూడా రషీద్‌ పెవిలియన్‌ చేర్చాడు. స్టబ్స్‌ (7), రాహుల్‌ ఒకే ఓవర్‌లో అవుట్‌ కావడంతో ఢిల్లీ పనైపోయిందనుకున్నారంతా. చివరి 3 ఓవర్లలో 45 రన్స్‌ అవసరం కాగా.. మళ్లీ క్రీజులోకి వచ్చిన మిల్లర్‌ అదిరే షాట్లతో గుజరాత్‌ గుండెల్లో గుబులు పుట్టించాడు. అయితే, ఆఖరి 6 బంతుల్లో 13 రన్స్‌ కావాల్సి ఉండగా.. విప్రాజ్‌ (12), మిల్లర్‌ బౌండ్రీ, సిక్స్‌ బాదారు. కానీ, చివరి బంతికి 2 పరుగులు కావాల్సి ఉండగా.. మిల్లర్‌ మిస్సయ్యాడు.


బాదేసిన బట్లర్‌: ఫామ్‌ను అందిపుచ్చుకొన్న బట్లర్‌తోపాటు గిల్‌, సుందర్‌ అర్ధ శతకాలతో రాణించడంతో.. గుజరాత్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌ స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (12) వికెట్‌ చేజార్చుకొంది. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ బట్లర్‌ ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. మరో ఓపెనర్‌ గిల్‌ చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలో ఐదో ఓవర్‌లో ముకేశ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ మూడు సిక్స్‌లు, ఫోర్‌తో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో గుజరాత్‌ 68/1తో నిలిచింది. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న బట్లర్‌ను కుల్దీప్‌ బౌల్డ్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో గిల్‌, సుందర్‌ మూడో వికెట్‌కు 104 పరుగులతో ఆదుకొన్నారు. హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌ను ఎన్‌గిడి పెవిలియన్‌ చేర్చడంతో.. డెత్‌ ఓవర్లలో గుజరాత్‌ ఆశించిన స్థాయిలో స్కోరు చేయలేక పోయింది. 6,4తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న సుందర్‌ ఆఖరి ఓవర్‌లో అవుటైనా.. ఫిలిప్స్‌ (14 నాటౌట్‌) జట్టు స్కోరును 200 మార్క్‌ దాటించాడు.

స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (బి) ముకేశ్‌ 12, గిల్‌ (సి) రాణా (బి) ఎన్‌గిడి 70, బట్లర్‌ (బి) కుల్దీప్‌ 52, వాషింగ్టన్‌ (సి) రాణా (బి) ముకేశ్‌ 55, ఫిలిప్స్‌ (నాటౌట్‌) 14, తెవాటియా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 210/4; వికెట్ల పతనం: 1-19, 2-79, 3-183, 4-205; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-55-2, ఎన్‌గిడి 4-0-24-1, అక్షర్‌ 3-0-32-0, కుల్దీప్‌ 4-0-42-1, నటరాజన్‌ 4-0-34-0, విప్రాజ్‌ నిగమ్‌ 1-0-23-0.

ఢిల్లీ: నిస్సాంక (సి) తెవాటియా (బి) ప్రసిద్ధ్‌ 41, రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 92, నితీశ్‌ రాణా (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 5, రిజ్వీ (బి) రషీద్‌ 0, మిల్లర్‌ (నాటౌట్‌) 41, అక్షర్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రషీద్‌ 2, స్టబ్స్‌ (రనౌట్‌) 7, విప్రాజ్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 12, కుల్దీప్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 209/8; వికెట్ల పతనం: 1-76, 2-101, 3-101, 4-134, 5-160, 6-166, 7-202, 8-209; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-52-1, రబాడ 4-0-32-0, రషీద్‌ ఖాన్‌ 4-0-17-3, అశోక్‌ 3-0-45-0, ప్రసిద్ధ్‌ 4-0-52-2, వాషింగ్టన్‌ 1-0-11-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 3 3 0 0 6 2.403

పంజాబ్‌ 3 2 0 1 5 0.637

బెంగళూరు 2 2 0 0 4 2.501

ఢిల్లీ 3 2 1 0 4 0.811

హైదరాబాద్‌ 3 1 2 0 2 0.275

గుజరాత్‌ 3 1 2 0 2 -0.270

లఖ్‌నవూ 2 1 1 0 2 -0.542

ముంబై 3 1 2 0 2 -0.715

కోల్‌కతా 3 0 2 1 1 -1.964

చెన్నై 3 0 3 0 0 -2.517

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 09 , 2026 | 03:54 AM