Share News

విరాట్‌పై అబద్ధాలు చెప్పమన్నారు..

ABN , Publish Date - May 13 , 2026 | 01:50 AM

విరాట్‌ కోహ్లీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు తనకు డబ్బు ఆశ చూపినట్టు జర్మనీ మోడల్‌ లిజ్లాజ్‌ వెల్లడించింది. కొంతకాలం కిందట విరాట్‌ కోహ్లీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోని...

విరాట్‌పై అబద్ధాలు చెప్పమన్నారు..

జర్మనీ మోడల్‌ లిజ్లాజ్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు తనకు డబ్బు ఆశ చూపినట్టు జర్మనీ మోడల్‌ లిజ్లాజ్‌ వెల్లడించింది. కొంతకాలం కిందట విరాట్‌ కోహ్లీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ ఫొటోకు లైక్‌ చేశాడు. దీంతో లిజ్లాజ్‌ తెగ పాపులర్‌ కావడంతో పాటు, విరాట్‌పై నెట్టింట ట్రోలింగ్‌ కూడా ఎక్కువైంది. ఆ తర్వాత అతను అన్‌లైక్‌ కూడా చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లిజ్లాజ్‌ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ‘విరాట్‌ గురించి చెడుగా చెప్పాలని, నాకు నేరుగా సందేశాలు పంపిస్తున్నట్టుగా ఆరోపించాలంటూ కొందరు విలేకరులు నాపై ఒత్తిడి తెచ్చారు. ఇలా చేసేందుకు డబ్బు ఆశ కూడా చూపారు. కానీ నేను వాటికి ఒప్పుకోలేదు. ఆ లైక్‌ వెనుక కోహ్లీకి దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 13 , 2026 | 01:50 AM