మ్యాజిక్ కోచ్
ABN , Publish Date - Mar 10 , 2026 | 02:59 AM
మాటలు కాదు.. చేతలే ముఖ్యమనే గౌతమ్ గంభీర్.. దాన్ని ఆచరించి మరీ చూపించాడు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. రెండేళ్లలో రెండు ఐసీసీ వైట్‌బాల్ ట్రోఫీలతో భారత జట్టు విజయవంతమైన కోచ్‌గా గంభీర్ ఘనత...
మాటలు కాదు.. చేతలే ముఖ్యమనే గౌతమ్ గంభీర్.. దాన్ని ఆచరించి మరీ చూపించాడు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. రెండేళ్లలో రెండు ఐసీసీ వైట్‌బాల్ ట్రోఫీలతో భారత జట్టు విజయవంతమైన కోచ్‌గా గంభీర్ ఘనత సాధించాడు. గ్రెగ్ చాపెల్ తర్వాత టీమిండియా కోచ్ గురించి అంత ఎక్కువగా చర్చ జరిగింది గంభీర్‌పైనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆవేశం, దుందుడుకుతనం అతడి ట్రేడ్ మార్క్. కానీ, ప్రయోగాలు, వ్యూహచతురతలో తనకు తానేసాటి అని మరోసారి నిరూపించుకొన్నాడు. రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పడంతో.. అందరూ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇస్తారని భావించారు. కానీ, పట్టుబట్టి సూర్యకుమార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది గౌతీనే. జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్‌ను మళ్లీ వరల్డ్‌క్‌పనకు ఎంపిక చేయడంలోనే గంభీర్ మార్క్ కనిపించింది. వరుసగా విఫలమవుతున్న అభిషేక్, వరుణ్ చక్రవర్తిలను ఫైనల్లో కూడా ఆడించడం గౌతీ స్టయిల్. తాను నమ్మినదాని కోసం ఎంతకైనా తెగించే తత్వమే ఆటగాళ్లకు అతడిపై నమ్మకం పెంచింది. తండ్రి మరణించడంతో రింకూ టోర్నీకి దూరమవుతాడని భావించారు. కానీ, రింకూ స్థానాన్ని భర్తీ చేయకుండా అతడినే జట్టులో కొనసాగించాడు.
ఇది భారత్ ‘వైట్ బాల్’ శకమా?
వరుసగా మూడేళ్లలో మూడు ఐసీసీ వైట్‌బాల్ ట్రోఫీలు నెగ్గడంలో ఇది భారత్ ‘వైట్‌బాల్ శకం’ అని కొనియాడుతున్నారు. కానీ, గంభీర్ మాత్రం విభేదించాడు. ‘వన్డే ఫార్మాట్‌లో గత మూడు సిరీ్‌సల్లో రెండు ఓడాం. మరి ఇది మా శకమా’ అని అన్నాడు. ఇక, టీ20 వరల్డ్‌క్‌పను మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) వీవీఎస్ లక్ష్మణ్‌కు గౌతీ అంకితమిచ్చాడు. భారత క్రికెట్‌ను రాహుల్ ఈస్థాయికి తీసుకురాగా.. భవిష్యత్ ఆటగాళ్లను లక్ష్మణ్ తీర్చిదిద్దుతున్నాడన్నాడు. తాను ఉండగా.. వ్యక్తిగత మైలురాళ్లకు సంబరాలు ఉండబోవని చెప్పాడు. ట్రోఫీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మీడియాను గౌతీ కోరాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని వారికే తాను జవాబుదారి అని.. సోషల్ మీడియాకు కాదని కౌంటర్ ఇచ్చాడు.
కోచ్ సాబ్.. ఆ నవ్వు అద్భుతం: ధోనీ
భారత్ జగజ్జేతగా నిలవడంతో.. గౌతీ మోములో ఎన్నడూ చూడని నవ్వు కనిపించింది. దీన్ని ధోనీ ప్రత్యేకంగా తన సోషల్ మీడియా పోస్టులో ప్రస్తావించాడు. ‘కోచ్ సాబ్.. మీ నవ్వు అద్భుతం. గంభీరత, చిరునవ్వు.. కిల్లర్ కాంబో’ అని మహీ ఎక్స్‌లో రాశాడు. దీనికి గౌతీ ‘ఆ నవ్వుకు కారణం.. నిన్ను చూడడమే’ అని రిప్లై ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ
పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్