Share News

ఇంగ్లండ్‌ ఆశలు సజీవం

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:10 AM

ఆదిల్‌ రషీద్‌ (3/36), టామ్‌ బాంటన్‌ (63 నాటౌట్‌) సత్తా చాటిన వేళ కీలకమైన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఐదు వికెట్లతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. గత పోరులో వెస్టిండీ్‌సపై ఓడిన...

ఇంగ్లండ్‌ ఆశలు సజీవం

నేటినుంచి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌

ఉత్తరాఖండ్‌ X కర్ణాటక

బెంగాల్‌ X జమ్మూ కశ్మీర్‌

స్కాట్లాండ్‌పై 5 వికెట్ల విజయం

కోల్‌కతా: ఆదిల్‌ రషీద్‌ (3/36), టామ్‌ బాంటన్‌ (63 నాటౌట్‌) సత్తా చాటిన వేళ కీలకమైన మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ ఐదు వికెట్లతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. గత పోరులో వెస్టిండీ్‌సపై ఓడిన ఇంగ్లిష్‌ జట్టు సూపర్‌-8కు ముందంజ వేయాలంటే శనివారంనాటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక..ఈ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో తొలుత స్కాట్లాండ్‌ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బాంటన్‌, బెతెల్‌ (32) ఆదుకోవడంతో ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 155/5 స్కోరు చేసి నెగ్గింది. బాంటన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు:

స్కాట్లాండ్‌: 19.4 ఓవర్లలో 152 ఆలౌట్‌ (రిచీ బేరింగ్టన్‌ 49, మైకేల్‌ జోన్స్‌ 33, టామ్‌ బ్రూస్‌ 24, అలివర్‌ డేవిడ్‌సన్‌ 20 నాటౌట్‌, ఆదిల్‌ రషీద్‌ 3/36, ఆర్చర్‌ 2/24, డాసన్‌ 2/34);

ఇంగ్లండ్‌: 18.2 ఓవర్లలో 155/5 (టామ్‌ బాంటన్‌ 63 నాటౌట్‌, బెతెల్‌ 32, కర్రాన్‌ 28, డేవిడ్‌సన్‌ 1/12, బ్రాడ్‌ కర్రీ 1/21).

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం

భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?

Updated Date - Feb 15 , 2026 | 05:11 AM