టాప్ లేపేశారు
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:33 AM
భారత్ ఖాతాలో వరుసగా రెండో వైట్‌వాష్. ఐర్లాండ్‌పైనే కాకుండా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను కూడా టీమిండియా ఒక్క విజయం లేకుండానే ముగించింది. శనివారం చివరిదైన...
ఆఖరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్‌దే
టీ20ల్లో నెంబర్‌వన్‌గా బ్రూక్ సేన
భారత్ చేజారిన టాప్ ర్యాంక్
సౌథాంప్టన్: భారత్ ఖాతాలో వరుసగా రెండో వైట్‌వాష్. ఐర్లాండ్‌పైనే కాకుండా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను కూడా టీమిండియా ఒక్క విజయం లేకుండానే ముగించింది. శనివారం చివరిదైన ఐదో టీ20లో భారత్ 56 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆతిథ్య జట్టు 4-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ఈ విజయంతో ఇంగ్లండ్ టీ20 ఫార్మాట్‌లోనూ నెంబర్‌వన్‌గా నిలిచింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131) సెంచరీ, కెప్టెన్ బ్రూక్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 నాటౌట్) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. దూబేకు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసి ఓడింది. ఇషాన్ (56), తిలక్ వర్మ (53) అర్ధసెంచరీలు చేశారు. సామ్ కర్రాన్‌కు 3, రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బట్లర్.. ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌సగా బ్రూక్ నిలిచారు.
పోరాటమే లేదు: భారీ ఛేదనలో భారత్ ఏ దశలోనూ విజయం వైపు సాగలేదు. మధ్య ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఇషాన్, తిలక్ హాఫ్ సెంచరీలు మినహా జట్టు ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు లేవు. ఓపెనర్ శాంసన్ (27) ఈసారి ఆకట్టుకున్నా ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. ఇషాన్-శ్రేయా్‌స (28) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక 11వ ఓవర్ నుంచి వికెట్ల పతనం సాగడంతో విజయానికి చాలా దూరంలో నిలిచింది. చివర్లో తిలక్ వేగం చూపినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

పరుగుల మోత: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఎదురుదాడికి రెండో వికెట్‌కు 233 పరుగుల రికార్డు భాగస్వామ్యం జత చేరింది. దీనికితోడు భారత్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా వీరికి కలిసివచ్చింది. రెండో ఓవర్‌లో ఓపెనర్ సాల్ట్ (6) వికెట్ మినహా భారత్ సాధించిందేమీ లేదు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను దూబే వదిలేయడం దెబ్బతీసింది. పవర్‌ప్లే తర్వాత ఈ జోడీ మరింత వేగం చూపింది. పదో ఓవర్‌లో బ్రూక్ 6,6,4తో 25 రన్స్, 14వ ఓవర్‌లో 6,4,6తో 24 పరుగులు అందించాడు. అటు బట్లర్ కూడా చెలరేగి 15వ ఓవర్‌లో 4,6,6,4తో 21.. తర్వాతి ఓవర్‌లో 6,6,4తో 20 రన్స్ అందించగా నాలుగు ఓవర్లలోనే ఇంగ్లండ్ 63 పరుగులతో అదుర్స్ అనిపించింది. అలాగే బట్లర్ 51 బంతుల్లో తన రెండో సెంచరీ అందుకున్నాడు. 19వ ఓవర్‌లో దూబే 22 పరుగులిచ్చుకున్నాడు. కానీ వరుస బంతుల్లో బట్లర్, బెథెల్ (0)ల వికెట్లు తీశాడు. ఆఖరి ఓవర్‌లో బ్రూక్ క్యాచ్‌ను మరోసారి వదిలేయగా.. ఇంగ్లండ్ 250 స్కోరును దాటేసింది.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్: సాల్ట్ (సి) సూర్యాన్ష్ (బి) ప్రసిద్ధ్ 6, బట్లర్ (సి) శ్రేయాస్ (బి) దూబే 131, బ్రూక్ (నాటౌట్) 95, బెథెల్ (సి) తిలక్ (బి) దూబే 0, జాక్స్ (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 257/3; వికెట్ల పతనం: 1-8, 2-241, 3-241; బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-33-0, ప్రసిద్ధ్ 4-0-38-1, ప్రిన్స్ 4-0-60-0, అక్షర్ 4-0-63-0, సూర్యాన్ష్ 3-0-39-0, దూబే 1-0-22-2.
భారత్: శాంసన్ (సి) బెథెల్ (బి) కర్రాన్ 27, అభిషేక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 3, ఇషాన్ (సి) సాల్ట్ (బి) రషీద్ 56, శ్రేయాస్ (సి) కర్రాన్ (బి) డాసన్ 28, తిలక్ (సి) బట్లర్ (బి) టంగ్ 53, శివమ్ దూబే (సి) ఆర్చర్ (బి) కర్రాన్ 14, సూర్యాన్ష్ (సి) బట్లర్ (బి) కర్రాన్ 7, అక్షర్ (సి) జాక్స్ (బి) రషీద్ 3, అర్ష్‌దీప్ (నాటౌట్) 4, ప్రసిద్ధ్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 201/8; వికెట్ల పతనం: 1-25, 2-55, 3-110, 4-131, 5-162, 6-189, 7-193, 8-199; బౌలింగ్: ఆర్చర్ 4-0-41-1, టంగ్ 4-0-53-1, జాక్స్ 3-0-32-0, కర్రాన్ 4-0-36-3, డాసన్ 2-0-14-1, రషీద్ 3-0-24-2.
వరుసగా ఆరు టీ20 ఓటములతో 1601 రోజులుగా కొనసాగుతున్న తమ అగ్రస్థానాన్ని టీమిండియా.. ఇంగ్లండ్ జట్టుకు కోల్పోయింది.
భారత్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు (257) సాధించిన జట్టుగా ఇంగ్లండ్.
ఈ మ్యాచ్‌కు ముందు ట్రాఫిక్ సమస్య కారణంగా టీమిండియా ఆటగాళ్లు ఆలస్యంగా స్టేడియానికి చేరుకోవడంతో టాస్‌ను రాత్రి 7.15కి వేసి.. మ్యాచ్‌ను 7.30కి ఆరంభించారు.
ఇవీ చదవండి:
స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్