Share News

ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌ మెకల్లమ్‌కు ఉద్వాసన

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:57 AM

ఇంగ్లండ్‌ క్రికెట్‌ చీఫ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. టెస్టు క్రికెట్‌ జట్టు కోచ్‌గా బ్రెండన్‌కు ఉద్వాసన పలికింది. అయితే, వైట్‌బాల్‌ జట్లు వన్డే, టీ20లకు మాత్రం...

ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌ మెకల్లమ్‌కు ఉద్వాసన

లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ చీఫ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) షాకిచ్చింది. టెస్టు క్రికెట్‌ జట్టు కోచ్‌గా బ్రెండన్‌కు ఉద్వాసన పలికింది. అయితే, వైట్‌బాల్‌ జట్లు వన్డే, టీ20లకు మాత్రం మెకల్లమ్‌ కోచ్‌గా కొనసాగనున్నాడు. 2022లో ఇంగ్లండ్‌ టెస్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 44 ఏళ్ల మెకల్లమ్‌.. అప్పటి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌తో కలిసి జట్టులో దూకుడైన ఆటతీరుకు శ్రీకారం చుట్టాడు. ఈ ఆటే బజ్‌బాల్‌ గేమ్‌గా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత 2024లో వైట్‌బాల్‌ కోచ్‌ పగ్గాలు కూడా మెకల్లమ్‌కే అప్పగించారు. అప్పటినుంచి అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది యాషెస్‌ సిరీ్‌సలో ఇంగ్లండ్‌ 1-4తో ఓడడం, ఆ తర్వాత స్టోక్స్‌ రిటైర్మెంట్‌లాంటి పరిణామాల నేపథ్యంలో.. మెకల్లమ్‌పై ఈసీబీ వేటు వేసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 04:57 AM