బాంటన్ సెంచరీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:52 AM
ఓపెనర్ టామ్ బాంటన్ (121) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 135 పరుగుల భారీ తేడాతో...
ఇంగ్లండ్‌దే రెండో వన్డే
అడిలైడ్: ఓపెనర్ టామ్ బాంటన్ (121) సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 135 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 355/6 స్కోరు చేసింది. కాక్స్ (67), రూట్ (62), జాక్స్ (54 నాటౌట్) సత్తా చాటారు. బార్ట్‌లెట్ 3 వికెట్లు పడగొట్టాడు. భారీ ఛేదనలో ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 220 పరుగులకు కుప్పకూలింది. గ్రీన్ (64), రెన్‌షా (63) మినహా అంతా విఫలమయ్యారు. అట్కిన్సన్ 4, కర్రాన్, డాసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో ఇంగ్లండ్ 1-1తో సమంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
బౌలర్లు పరిస్థితులకు తగ్గట్లు పోరాడి జట్టును గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
డబ్ల్యూపీఎల్ 2027: ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే.. వేదిక మార్చిన బీసీసీఐ