దులీప్ ట్రోఫీ విజేత ఈస్ట్‌జోన్
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:40 AM
సుదీర్ఘ విరామం తర్వాత ఈస్ట్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 2013 తర్వాత...
రెండో ఇన్నింగ్స్ 388/7
ఖురేషి శతకం
సౌత్‌తో ఫైనల్ డ్రా
చెన్నై: సుదీర్ఘ విరామం తర్వాత ఈస్ట్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 2013 తర్వాత మరోసారి టైటిల్ దక్కించుకుంది. గురువారం ఆఖరి రోజు ఇషాన్ కిషన్ సేన రెండో ఇన్నింగ్స్‌ను 388/7 స్కోరు దగ్గర డిక్లేర్ చేయడంతో జట్టు ఆధిక్యం 760 పరుగులకు చేరింది. అయితే మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారం మేరకు అంపైర్లు డ్రాగా ప్రకటించారు. కౌనైన్ ఖురేషి (116 నాటౌట్) అజేయ శతకం సాధించగా.. అనుకుల్ రాయ్ (64), కుమార్ కుషాగ్ర (46) రాణించారు. నిధీష్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ 708, సౌత్ 336 పరుగులు చేశాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇషాన్, ప్లేయర్ ఆఫ్ ద సిరీ స్‌గా తిలక్ వర్మ నిలిచారు.
భారీ భాగస్వామ్యం: సౌత్‌కు ఫాలోఆన్ ఇవ్వకుం డా ఈస్ట్ జోన్ ఆఖరి రోజును 212/5తో ఆరంభించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఖురేషి, కుషాగ్ర జోడీ, ఆ తర్వాత ఖురేషి-అనుకుల్‌ను విడదీసేందుకు సౌత్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో సెషన్‌లో ఖురేషి శతకం సాధించగా.. అనుకుల్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరికి ఏడో వికెట్‌కు 150 పరుగులు జత చేశాక అనుకుల్ వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్తస్కోర్లు:
ఈస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్: 708,
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 336;
ఈస్ట్ రెండో ఇన్నింగ్స్: 99.2 ఓవర్లలో 388/7 (ఖురేషి 116 నాటౌట్, ఇషాన్ 80, అనుకుల్ 64, కుషాగ్ర 46; నిధీష్ 2/28)
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ