Share News

దూబే.. దంచేసినా

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:44 AM

ఆల్‌రౌండర్‌ శివం దూబే (23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ధనాధన్‌ అర్ధశతకంతో అదరగొట్టినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు...

దూబే.. దంచేసినా

డబ్ల్యూపీఎల్‌లో నేడు

బెంగళూరు X యూపీ (రా. 7.30)

శివం దూబే (23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65)

టిమ్‌ సీఫెర్ట్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62)

నాలుగో టీ20లో భారత్‌పై కివీస్‌ విజయం

  • సీఫెర్ట్‌ అర్ధ శతకం ఫ తిప్పేసిన శాంట్నర్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఆల్‌రౌండర్‌ శివం దూబే (23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65) ధనాధన్‌ అర్ధశతకంతో అదరగొట్టినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. బుధవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. తొలుత కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. టిమ్‌ సీఫెర్ట్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62) అర్ధ శతకం సాధించగా.. కాన్వే (44), డారెల్‌ మిచెల్‌ (39 నాటౌట్‌) రాణించారు. అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో భారత్‌ 18.4 ఓవర్లలో 165 పరుగులకు కుప్పకూలింది. రింకూ సింగ్‌ (39), సంజూ శాంసన్‌ (24) ఫర్వాలేదనిపించారు. శాంట్నర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్‌ డఫీ, ఇష్‌ సోథీ చెరో రెండు వికెట్లు దక్కించుకొన్నారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీ్‌సలో న్యూజిలాండ్‌ 1-3తో భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించింది. ఫిట్‌నెస్‌ లోపంతో ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సీఫెర్ట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


ఆరంభంలోనే తడ‘బ్యాటు’..

ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌ కాగా.. రెండో ఓవర్లో సూర్యకుమార్‌ (8)ను డఫీ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు.. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో శాంసన్‌, రింకూ మూడో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. దీంతో భారత్‌ ఆరు ఓవర్లకు 53/2తో నిలిచింది. అయితే, శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా (2)ను శాంట్నర్‌, తర్వాత రింకూను ఫోక్స్‌ ఎల్బీ చేశారు. అయితే ఈ దశలో ఒక్కసారిగా విజృంభించిన దూబే.. విజయంపై ఆశలు రేపాడు. సోధీ వేసిన 12వ ఓవర్‌లో దూబే రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లతో కలిపి 29 పరుగులు పిండుకోవడంతో స్కోరు బోర్డు ఊపందుకొంది. ఈ క్రమంలో రాణా (9)తో కలసి దూబే ఆరో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ, దూబే రనౌట్‌ కావడంతో టీమిండియా పరాజయం లాంఛనమే అయింది. విజయానికి చివరి 30 బంతుల్లో 71 పరుగులు కావల్సి ఉండగా.. హర్షిత్‌, అర్ష్‌దీప్‌ (0), బుమ్రా (4), కుల్దీప్‌ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

చెలరేగిన ఓపెనర్లు..

ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్‌ పవర్‌ప్లేలో అదరగొట్టడంతో.. న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యంతో పటిష్ట పునాది వేశారు. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా సీఫెర్ట్‌ ఎడాపెడా షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో పవర్‌ప్లేను కివీస్‌ 71/0తో ముగించింది. 9వ ఓవర్‌లో కాన్వేను అవుట్‌ చేసిన కుల్దీప్‌ జట్టుకు తొలి బ్రేక్‌ అందించాడు. ఆ వెంటనే రచిన్‌ (2)ను బుమ్రా వెనక్కి పంపాడు. ఇక సీఫెర్ట్‌ను అర్ష్‌దీప్‌ క్యాచవుట్‌ చేశాడు. ఫిలిప్స్‌ (24)ను కుల్దీప్‌.. చాప్‌మన్‌ (9)ను బిష్ణోయ్‌ పెవిలియన్‌కు చేర్చారు. కెప్టెన్‌ శాంట్నర్‌ (11)ను పాండ్యా అద్భుత త్రోతో రనౌట్‌ చేయగా..ఫోక్స్‌(13)ను అర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. కానీ, డెత్‌ ఓవర్లలో మిచెల్‌ ధాటిగా ఆడడంతో టీమ్‌ స్కోరు 200 పరుగుల మార్క్‌ దాటింది.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: కాన్వే (సి) రింకూ (బి) కుల్దీప్‌ 44, సీఫెర్ట్‌ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్‌ 62, రచిన్‌ (సి అండ్‌ బి) బుమ్రా 2, ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) కుల్దీప్‌ 24, చాప్‌మన్‌ (సి) హర్షిత్‌ (బి) బిష్ణోయ్‌ 9, మిచెల్‌ (నాటౌట్‌) 39, శాంట్నర్‌ (రనౌట్‌/పాండ్యా) 11, ఫోక్స్‌ (సి) రింకూ (బి) అర్ష్‌దీప్‌ 13, హెన్రీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 215/7; వికెట్ల పతనం: 1-100, 2-103, 3-126, 4-137, 5-152, 6-163, 7-182; బౌలింగ్‌ : అర్ష్‌దీప్‌ 4-0-33-2, హర్షిత్‌ రాణా 4-0-54-0, బుమ్రా 4-0-38-1, బిష్ణోయ్‌ 4-0-49-1, కుల్దీప్‌ 4-0-39-2.

భారత్‌: అభిషేక్‌ (సి) కాన్వే (బి) హెన్రీ 0, శాంసన్‌ (బి) శాంట్నర్‌ 24, సూర్యకుమార్‌ (సి అండ్‌ బి) డఫీ 8, రింకూ సింగ్‌ (ఎల్బీ) ఫోక్స్‌ 39, హార్దిక్‌ (సి) ఫోక్స్‌ (బి) శాంట్నర్‌ 2, దూబే (రనౌట్‌/హెన్రీ) 65, హర్షిత్‌ రాణా (సి) రచిన్‌ (బి) సోధీ 9, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 10, అర్ష్‌దీప్‌ (సి) శాంట్నర్‌ (బి) సోధీ 0, బుమ్రా (సి) సోధీ (బి) శాంట్నర్‌ 4, కుల్దీప్‌ (సి) సీఫెర్ట్‌ (బి) డఫీ 1; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.4 ఓవర్లలో 165 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-9, 3-55, 4-63, 5-82, 6-145, 7-157, 8-157, 9-162, 10-165; బౌలింగ్‌: హెన్రీ 3-0-24-1, డఫీ 3.4-0-33-2, ఫోక్స్‌ 3-0-29-1, సోధీ 4-0-46-2, శాంట్నర్‌ 4-0-26-3, ఫిలిప్స్‌ 1-0-7-0.

ఇవి కూడా చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు

జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్‌

Updated Date - Jan 29 , 2026 | 05:44 AM