Share News

దీప్తి.. రెండు స్థానాలు పైకి

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:31 AM

అంతర్జాతీయ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్‌ దీప్తి శర్మ రెండు స్థానాలు ఎగబాకింది...

దీప్తి.. రెండు స్థానాలు పైకి

టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: అంతర్జాతీయ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్‌ దీప్తి శర్మ రెండు స్థానాలు ఎగబాకింది. ప్రస్తుత ఆసియా కప్‌లో అదరగొడుతున్న దీప్తి మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు సాధించింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉంది. మరోవైపు తెలుగమ్మాయి శ్రీచరణి టాప్‌లోనే కొనసాగుతోంది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన టాప్‌-5లో పదిలంగా ఉంది. మంగళవారం ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో స్మృతి ఐదు, షఫాలీ ఏడో స్థానాలను కాపాడుకున్నారు.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:31 AM