Share News

రాజస్థాన్‌కు షనక

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:39 AM

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక గుడ్‌ బై చెప్పాడు....

రాజస్థాన్‌కు షనక

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక గుడ్‌ బై చెప్పాడు. ఈ శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌లో చేరడం ఖాయమైంది. త్వరలో అతడు జట్టులో చేరతాడని రాజస్థాన్‌ రాయల్స్‌ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. శ్రీలంక దిగ్గజ బ్యాటర్‌ కుమార సంగక్కర రాజస్థాన్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా..రూ. 75 లక్షల ప్రారంభ ధరతో ఐపీఎల్‌ మినీ వేలంలో దిగినా షనకను ఎవరూ కొనలేదు. ఇప్పుడు అదే ధరకు రాజస్థాన్‌ జట్టుతో చేరతాడు. ఇక..పీఎ్‌సఎల్‌ వేలంలో లాహోర్‌ కలందర్స్‌ జట్టు దసున్‌ను రూ. 75 లక్షలకు దక్కించుకుంది. రెండు చోట్లా ఒకటే ధర అయినా...పాక్‌ కరెన్సీతో పోలిస్తే భారత కరెన్సీ చాలా విలువైనది కావడంవల్ల దసున్‌ ఐపీఎల్‌వైపు మొగ్గుచూపాడు.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:39 AM