Share News

ప్రమాదకరంగా పిచ్‌..

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:48 AM

ప్రమాదకర పిచ్‌ కారణంగా వెస్టిండీస్‌ దేశవాళీ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఓ బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయి బ్యాటర్‌కు తగలడంతో అతడు కిందపడిపోయాడు...

ప్రమాదకరంగా పిచ్‌..

  • బంతి తగిలి పడిపోయిన బ్యాటర్‌

న్యూఢిల్లీ: ప్రమాదకర పిచ్‌ కారణంగా వెస్టిండీస్‌ దేశవాళీ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఓ బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయి బ్యాటర్‌కు తగలడంతో అతడు కిందపడిపోయాడు. హెల్మెట్‌ కూడా ఊడిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెస్టిండీస్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా లీవర్డ్స్‌ ఐలాండ్‌-ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో మధ్య ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ట్రినిడాడ్‌ బౌలర్‌ జేడెన్‌ సీల్స్‌ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్‌ అయి బ్యాటర్‌ జెర్మీ లూయిస్‌ హెల్మెట్‌కు తగిలింది. దీంతో జెర్మీ ఒక్కసారిగా కిందపడిపోగా..హెల్మెట్‌ కూడా ఊడి వచ్చింది. పైకి లేచిన లూయిస్‌ తీవ్ర అసహనంతో హెల్మెట్‌ను కాలితో తన్నాడు. కంకషన్‌ పరీక్ష కోసం జెర్మీని ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఐలాండ్‌ 140/7 స్కోరు చేసింది. కూలిన 7 వికెట్లు సీల్స్‌ ఖాతాలోనే పడ్డాయి. ఈ క్రమంలో పిచ్‌పై ఆడడం ఆటగాళ్లకు క్షేమం కాదని భావించిన విండీస్‌ బోర్డు మ్యాచ్‌ను నిలిపేసి డ్రాగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 23 , 2026 | 01:48 AM