సీఎస్కే బ్యాటింగ్ కోచ్ హస్సీ అవుట్
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:42 AM
బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీని కూడా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సాగనంపింది. ఐపీఎల్‌లో ఆరు సీజన్లపాటు చెన్నైకి ఆడిన హస్సీ..
చెన్నై: బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీని కూడా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సాగనంపింది. ఐపీఎల్‌లో ఆరు సీజన్లపాటు చెన్నైకి ఆడిన హస్సీ.. 2018 నుంచి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో సహాయ సిబ్బందిని ప్రక్షాళన చేయాలని సీఎస్కే భావించింది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్‌కు బాధ్యతలు అప్పగించింది. అసిస్టెంట్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గారెత్ బాట్టీని తాజాగా నియమించింది.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..