సీఎస్‌కే, ధోనీ మధ్య అంతా బాగేనా?
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:47 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి....
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే), ధోనీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ చరమాంకంలో ఉన్న ధోనీ.. సీఎ్‌సకేలో వాటా ఖరీదు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. కానీ, అతడి షరతులకు ఫ్రాంచైజీ ఒప్పుకోవడం లేదని సమాచారం. వాస్తవంగా ధోనీ 25 శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తే.. సీఎస్‌కే యాజమాన్యం కేవలం 3 శాతం మాత్రమే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిందట. పలుమార్లు బేరసారాలు సాగిన తర్వాత చివరగా మహీ 18 శాతం కోరితే.. మేనేజ్‌మెంట్ 5.5 శాతం షేర్లు మాత్రమే అమ్మడానికి అంగీకరించిందని తెలిసింది. అయితే, ఇరుపక్షాల మధ్య మౌఖికంగా మాత్రమే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!