Share News

ఇడ్లీ..దోశ పాటతో అవమానించారు..

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:02 AM

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈనెల ఐదు న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ సం దర్భంగా తమకు అవమానం జరిగిందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బీసీసీఐకి ఫిర్యాదు...

ఇడ్లీ..దోశ పాటతో అవమానించారు..

డీజేపై బీసీసీఐకి సీఎ్‌సకే ఫిర్యాదు

చెన్నై: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈనెల ఐదు న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ సం దర్భంగా తమకు అవమానం జరిగిందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌లో సీఎ్‌సకే ఇన్నింగ్స్‌కు ముందు డిస్క్‌ జాకీ (డీజే) ‘దోశ, ఇడ్లీ, సాంబర్‌, చట్నీ’ అన్న పాటను వినిపిస్తూ తమ ఆటగాళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేసినట్టు సీఎ్‌సకే ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై సీఎ్‌సకే ఎండీ కాశీ విశ్వనాథన్‌ స్పందిస్తూ ‘సాధారణంగా డీజేలు సొంత జట్టుకు మద్దతు పలుకుతారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో డీజే వ్యవహరించిన తీరు పూర్తి భిన్నంగా ఉంది. మా క్రికెటర్లపై డీజే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీసీసీఐకి మేం ఫిర్యాదు చేశాం’ అని తెలిపారు. సీఎ్‌సకే ఫిర్యాదును ఐపీఎల్‌ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దీనిపై ఐపీఎల్‌ పాలక మండలి దృష్టి సారించినట్టు వెల్లడించారు. ‘దోశ, ఇడ్లీ’ పాటను వాస్తవంగా గణ అప్పు అనే మ్యుజీషియన్‌ రూపొందించారు. సీఎ్‌సకే-ఆర్సీబీ మ్యాచ్‌ల సందర్భంగా ఈ పాట స్టేడియాలను హోరెత్తిస్తుంటుంది. కానీ ఈసారి సదరు డీజే తీరుతో వివాదాస్పదమైంది.

ఇవి కూడా చదవండి:

బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ బౌలర్‌

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ

Updated Date - Apr 17 , 2026 | 03:02 AM