Share News

ఆ డబ్బు వెనక్కివ్వండి

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:30 AM

మాజీ భార్య, ఆయేషా ముఖర్జీతో న్యాయపోరాటంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ నెగ్గాడు. భరణం కింద ఆయేషా తీసుకున్న రూ. 5.72 కోట్లను తిరిగి ధవన్‌కు చెల్లించాలని...

ఆ డబ్బు వెనక్కివ్వండి

ధవన్‌ మాజీ భార్యకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: మాజీ భార్య, ఆయేషా ముఖర్జీతో న్యాయపోరాటంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ నెగ్గాడు. భరణం కింద ఆయేషా తీసుకున్న రూ. 5.72 కోట్లను తిరిగి ధవన్‌కు చెల్లించాలని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న ఆయేషా.. ఆ దేశ నిబంధనల ప్రకారం విడాకుల అనంతరం భార్యాభర్తల మధ్య ఆస్తుల పంపిణీ జరగాలంటూ అక్కడి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఆయేషాకు రూ. 5.72 కోట్లను ధవన్‌ చెల్లించాడు. అయితే, ఆసీస్‌ చట్టాలు భారత్‌లో చెల్లవని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు తాజా తీర్పులో పేర్కొంది. 2012లో భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఆయేషా, ధవన్‌.. 2024లో విడాకులు తీసుకున్నారు. ధవన్‌.. ఈనెల 22న తన స్నేహితురాలు సోఫీ షైన్‌ను మనువాడిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 26 , 2026 | 05:30 AM