Share News

క్రికెటర్‌ పోరెల్‌ను అరెస్ట్‌ చేయండి

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:21 AM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్‌ యువ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ...

క్రికెటర్‌ పోరెల్‌ను అరెస్ట్‌ చేయండి

  • లైంగిక వేధింపుల కేసులో కలకత్తా హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగాల్‌ యువ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశించింది. గతంలో పోరెల్‌ తనను లైంగికంగా వేధించడంతో పాటు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించినట్టు ఓ వైద్య విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం పోరెల్‌తో పరిచయమైందని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ముఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుపై విచారించిన కోర్టు.. పోరెల్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Jul 22 , 2026 | 05:21 AM