Share News

సచిన్‌ రికార్డు బద్దలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:15 AM

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆటగాడిగా జింబాబ్వే వెటరన్‌ బ్రెండన్‌ టేలర్‌ రికార్డు నెలకొల్పాడు...

సచిన్‌ రికార్డు బద్దలు

  • బ్రెండన్‌ ‘కెరీర్‌’ రికార్డు

హరారే: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆటగాడిగా జింబాబ్వే వెటరన్‌ బ్రెండన్‌ టేలర్‌ రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ఆస్ర్టేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆడడంతో టేలర్‌ కెరీర్‌లో 22 ఏళ్ల నాలుగు నెలల కాలం పూర్తయింది. 40 ఏళ్ల టేలర్‌ 2004, ఏప్రిల్‌లో అరంగేట్రం చేశాడు. ఈక్రమంలో అతను సచిన్‌ టెండూల్కర్‌ (22 ఏళ్ల మూడు నెలలు) పేరిటనున్న ఆ ఘనతను అధిగమించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 59 పరుగులతో గెలిచింది.

Also Read:

అక్టోబర్‌ 3న ‘పాన్-IIT AP సమ్మిట్‌ 2026’: సీఎం చంద్రబాబు

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

Updated Date - Sep 16 , 2026 | 05:15 AM