ఫైనల్ రద్దు.. పాక్‌కు కప్
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:46 AM
అంధుల ఆసియాక్‌పలో వివాదం చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో...
భారత జట్టు నిరసన
అంధుల ఆసియాకప్
ఢాకా: అంధుల ఆసియాక్‌పలో వివాదం చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించాల్సి ఉండగా, రెఫరీ మాత్రం పాక్‌ను చాంపియన్‌గా తేల్చడంతో భారత ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. అయితే భారత్‌తో పోల్చితే పాక్‌కు మెరుగైన రన్‌రేట్ ఉందనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కానీ, నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ టై లేదా రద్దయినా ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారని భారత అంధుల క్రికెట్ సంఘం కార్యదర్శి శైలేంద్ర గుర్తుచేశాడు. టోర్నీ జరిగింది బంగ్లాదేశ్‌లో కాబట్టి పాక్ అధికారులు వారిపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని మార్చుకున్నారని ఆరోపించాడు. ట్రోఫీ బహూకరణ కార్యక్రమాన్ని భారత్ బహిష్కరించింది. కాగా, భవిష్యత్‌లో పాక్‌తో మ్యాచ్‌లను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని శైలేంద్ర హెచ్చరించాడు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..