‘ఉప్పల్’లో బ్లాక్ మ్యాజిక్ కలకలం!
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:28 AM
ఉప్పల్‌లో శనివారం చెన్నై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉప్పల్‌లో శనివారం చెన్నై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై ఇన్నింగ్స్ జరుగుతుండగా, స్టేడియంలో సన్‌రైజర్స్ అభిమాని ఒకరు నిమ్మకాయ పట్టుకొని మంత్రం జపిస్తుండగా, సరిగ్గా అదే సమయంలో క్రీజులో ఉన్న శివమ్ దూబే వికెట్ కోల్పోయిన దృశ్యం కనిపించింది. దీంతో ఆ అభిమాని బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) చేయడంతోనే చెన్నై ఆటగాడు అవుటయ్యాడన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకొంది. దీంతో.. జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా కొందరు మంత్రతంత్రాలు ప్రయోగించారంటూ చెన్నై జట్టు యజమాని కాశీ విశ్వనాథన్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారన్న లేఖ ఒకటి బయటికొచ్చింది. అయితే, ఇదంతా అబద్దమనీ..గతంలో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో సంగీతానికి సంబంధించి చెన్నై ఫిర్యాదు లేఖను కొందరు నెటిజన్లు ఇలా బ్లాక్‌మ్యాజిక్ ఫిర్యాదు లేఖగా సృష్టించారని తేలింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్
ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156