Share News

ఢిల్లీకి డకెట్‌ షాక్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:14 AM

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ ఆఖరి నిమిషంలో ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నాడు. వేలంలో డకెట్‌ను..

ఢిల్లీకి డకెట్‌ షాక్‌

హఠాత్తుగా ఐపీఎల్‌కు దూరం

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌ ఆఖరి నిమిషంలో ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నాడు. వేలంలో డకెట్‌ను రూ. 2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే, డకెట్‌ హఠాత్తుగా మనసు మార్చుకొన్నాడు. తన కెరీర్‌ కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకొన్నట్టు సోషల్‌ మీడియాలో తెలిపాడు. కాగా, ఎటువంటి కారణం లేకుండా ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడంతో లీగ్‌ నిబంధనల ప్రకారం అతడిపై రెండేళ్లపాటు నిషేధం పడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Updated Date - Mar 25 , 2026 | 05:14 AM