Share News

గంభీర్‌ను తప్పిస్తారా?

ABN , Publish Date - Jul 11 , 2026 | 03:29 AM

భారత జట్టు వరుస ఓటములు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఇర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో...

గంభీర్‌ను తప్పిస్తారా?

జట్టు ఓటములపై బీసీసీఐ సీరియస్‌ ఫ కోచ్‌, ఆటగాళ్లపై సమీక్ష

న్యూఢిల్లీ: భారత జట్టు వరుస ఓటములు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఇర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో భారత టీ20 జట్టు సిరీ్‌సలను కోల్పోవడం బీసీసీఐకి మింగుడు పడడం లేదు. దీంతో ఈ పరాజయాలపై బోర్డు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్‌, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పనితీరును సమీక్షించాలని భావిస్తోంది. ముఖ్యంగా కోచ్‌ గంభీర్‌ పాత్రపై చర్చించనుంది. 2027 వరకు అతని పదవీకాలం ఉన్నప్పటికీ కఠిన నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉందని సమాచారం. ఎందుకంటే గౌతీ శిక్షణలో జట్టు 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ చేజారింది. అలాగే పదేళ్ల తర్వాత బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని, తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోల్పోవడం, తాజాగా రెండు వరుస టీ20 సిరీ్‌సల్లో చిత్తవడం జట్టు పేలవ ప్రదర్శనను సూచిస్తోంది. ఇక శ్రేయాస్‌ అయ్యర్‌ నేతృత్వంలో కొత్త శకం ఆరంభం కానుందని అంతా భావించారు. కానీ తన కెప్టెన్సీలో చివరి 13 టీ20 (ఐపీఎల్‌తో కలిపి)ల్లో గెలిచింది ఒక్క మ్యాచే కావడం గమనార్హం. ఓవర్సీస్‌ పిచ్‌లపై జట్టు ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా జట్టులో సమస్యలన్నీ బయటపడుతుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘భారత జట్టు ప్రదర్శన మాకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్‌ ముగిశాక ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శ్రేయా్‌సలతో తప్పకుండా సమీక్షిస్తాం. భవిష్యత్‌లో సమస్యలను సరిదిద్దుకుని మా స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తాం’

సైకియా, బోర్డు కార్యదర్శి

ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

Updated Date - Jul 11 , 2026 | 03:29 AM