టీమిండియా వైఫల్యాలపై చర్చ
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:39 AM
టీమిండియా తక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బీసీసీఐ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరు కావాల్సిందిగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్‌తోపాటు...
రోహిత్ భవితవ్యంపైనా నిర్ణయం?
నేడు బీసీసీఐ కీలక సమీక్షా సమావేశం
ముంబై: టీమిండియా తక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బీసీసీఐ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరు కావాల్సిందిగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గంభీర్‌తోపాటు సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆదేశించింది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ అత్యున్నత స్థాయి భేటీకి రానున్నాడు. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో భారత జట్టు ఘోర ప్రదర్శనతోపాటు త్వరలో జరగబోయే న్యూజిలాండ్ టూర్ గురించి చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. లంకతో టెస్ట్ సిరీ్‌సకు బుమ్రాను ఎంపిక చేసినా.. అతడు అనుకొన్నట్టుగా కోలుకోకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకొని కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్, పనిభారంపై లోతుగా సమీక్షించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా సీవోఈలో పునరావాసంలో ఉన్న ప్లేయర్లు కోలుకొని ఎప్పుడు అందుబాటులోకి వస్తారనేది అంచనా వేసి సెలెక్టర్లకు అప్‌డేట్ చేయాల్సిందిగా సూచించే అవకాశం ఉంది. వెటరన్లు రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా భవితవ్యంపై ప్రశ్నలు లేవనెత్తే చాన్సులున్నాయి. రోహిత్ విషయంలో బోర్డు, సెలెక్టర్లు ఏకాభిప్రాయంతో లేరనే విషయం గతంలోనే బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ భవితవ్యంపై కచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొంటారని భావిస్తున్నారు. అగార్కర్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు పొడిగించే విషయం కూడా తేలనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..