Share News

హోటల్‌లో గర్ల్‌ఫ్రెండ్స్‌కు నో!

ABN , Publish Date - May 05 , 2026 | 05:27 AM

ఐపీఎల్‌ సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్స్‌ ఆయా క్రికెటర్లతో కలిసి హోటళ్లలో ఉండకుండా నిబంధన రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ విషయాన్ని వచ్చే...

హోటల్‌లో గర్ల్‌ఫ్రెండ్స్‌కు నో!

వచ్చే ఐపీఎల్‌ నుంచి బీసీసీఐ నిబంధన

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్స్‌ ఆయా క్రికెటర్లతో కలిసి హోటళ్లలో ఉండకుండా నిబంధన రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ విషయాన్ని వచ్చే బోర్డు సమావేశంలో చర్చించనుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ నిబంధనను వచ్చే ఐపీఎల్‌ నుంచి అమలు చేయాలనుకుంటోందట. భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు క్రికెటర్లతో హోటల్‌లో ఉంటే పర్లేదుకానీ..గర్ల్‌ఫ్రెండ్స్‌తోనేచిక్కని బీసీసీఐ భావిస్తోంది. హార్దిక్‌ పాండ్యా, యశస్వీ జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు బీసీసీఐ తేల్చింది. క్రికెటర్లు డేటింగ్‌లో ఉండడంపై బీసీసీఐకి ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ కొందరు ఆటగాళ్లు వారితో హోటల్‌ గదుల్లో ఉండడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. క్రికెటర్ల గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లున్నారు. వారు సున్నితమైన సమాచారాన్ని సోషల్‌మీడియాలో పంచుకొంటే ప్రమాదమని బీసీసీఐ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:28 AM